Subscription Service

All Ads in Telugu

స్థిరత్వం నెలకొన్న కొబ్బరి మరియు నూనె ధరలు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలు పెంచిన తర్వాత దేశంలోని కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా దక్షిణాది రాష్ట్రాల ఉత్పాదకుల వద్ద సరుకు నిల్వలు సమృద్ధిగా పేరుకుపోవడమే ఇందుకు తార్కాణం. ప్రభుత్వం కొనుగోలు చేసిన సరుకు ఏ క్షణాననైనా విక్రయించే అవకాశం ఉంది. కావున స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 9-10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై కిరాణా కొబ్బరి రూ. 13,400-13,500, బంతికొబ్బరి రూ. 14,000-14,300, మెరికో రూ. 13,200-13,300, సాధారణ రకం రూ. 11,000-11,300, అరిసెకేరిలో 500 బస్తాలు స్థానికంగా రూ. 13,700- 14,400, మీడియం రూ. 9800-11,000 మరియు తమిళనాడులోని కొడుముడి, పెరుందురై, వెల్లకోవిల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 9-10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 13,700-14,800, మీడియం రూ. 13,100-14,000 మరియు కేరళలోని కోజికోడ్లో నూనె రూ. 24,500-25,000, బంతి కొబ్బరి రూ. 17,750, మిల్లింగ్ సరుకు రూ. 17,200, దిల్పసంద్ రూ. 17,000, రాజాపురి రూ. 20,500, కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 13,600, స్పెషల్ రూ. 14,300, మెరికో రూ. 14,000, కిరాణా రకం రూ. 16,600-17,000, రూ. 13,250, త్రిచూర్లో నూనె రూ. 22,000-22,400, కొచ్చిలో రూ. 21,900-22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో ప్రతి రోజు 25-30 వాహనాల కొబ్బరికాయల రాబడిపై గుజరాత్ రకం పెద్దసైజు కాయలు రూ. 16,000, మహారాష్ట్ర సరుకు రూ. 13,000, మీడియం రూ. 10,000-11,000, సాధారణ రకం రూ. 7000-8000, గుజరాత్ రకం పాత సరుకు రూ. 13,000, మహారాష్ట్ర రూ. 12,000, మీడియం రూ. 9000-10,000 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:46 am
పెరిగిన వేరుసెనగ సరఫరా - ధరలు బలోపేతం

హైదరాబాద్ : దేశంలో డిసెంబర్ 20 నాటికి నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.89 కోట్ల హెక్టార్ల నుండి తగ్గి 95.22 ల.హె.కు పరిమితమైంది. ఇందులో ఆవాల సేద్యం 93.73 ల.హె. నుండి 88.50 ల.హె., వేరుసెనగ 3.12 ల.హె. నుండి 2.89 ల.హె.కు పరిమితమైంది. అయితే, సానుకూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు సంతృప్తికరంగా ఉండగలవని తెలుస్తోంది. 2024-25 రబీ సీజన్ కోసం డిసెంబర్ 21 నాటికి కర్ణాటకలో వేరుసెనగ సేద్యం 1.08 ల.హె. నుండి పెరిగి 1.45 ల.హె.లో విస్తరించింది. దేశంలోని ప్రముఖ వేరుసెనగ ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ రాబడులు సన్నగిల్లినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-250 వృద్ధి చెందింది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 60-70 వేల బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 80-90 వేల బస్తాలు, రాజస్తాన్ 1.50 లక్షల బసాలు, మధ్యప్రదేశ్ 85-90 వేల బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారంలో 40-50 వేల బస్తాలు, కర్ణాటకలో 50-60 వేల బస్తాల వేరుసెనగ రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని 4-6 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 8-9 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 4500-6400, కర్నూలులో 4-5 వేల బస్తాలు, అనంతపురంలో 3-4 వేల బస్తాలు కదిరి లేపాక్షి రూ. 4200-5000, కె-6 బెస్ట్ పీ-నట్ మిక్స్ సరుకు రూ. 5000-6300. హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9000-9200, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 9400-9500, 60-70 కౌంట్ రూ. 9800-10,000, 60-65 కౌంట్ రూ. 10,800 మరియు తెలంగాణలోని వనపర్తిలో గత వారం 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 5000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు రూ. 3800-4300, హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 7200, 50-60 కౌంట్ రూ. 8150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో రూ. 4500-6200, రాజ్కోట్లో 20-నంబర్ సూపర్ రకం ఎండు సరుకు రూ. 5650-5900, మీడియం రూ. 5400-5700, సాధారణ రకం రూ. 5150-5400, బిటి-39 సూపర్ రకం సరుకు రూ. 5250-5900, మీడియుం రూ. 4500-5000, సాధారణ రకం రూ. 4250-4500, హెచ్పిఎస్ ముంద్రా ఓడరేవు డెలివరి 50-60 కౌంట్ కొత్త సరుకు బోల్డు రూ. 7600, 40-50 కౌంట్ రూ. 8000, 38-42 కౌంట్ రూ. 8200, 39 రకం బోల్డు కొత్త సరుకు 40-50 కౌంట్ రూ. 8100, 35-40 కౌంట్ రూ. 8200, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80-90 కౌంట్ రూ. 7200, 50-60 కౌంట్ రూ. 8150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతి రోజు 40-50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5300-5600, మీడియం రూ. 5000-5300, సాధారణ రకం రూ. 4900-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, దావణగెరి, శీరా, చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి రూ. 4000-5000, కె-6 రూ. 6000-6800, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 8900-9000, 90-100 కౌంట్ రూ. 8700-8800, 70-80 కౌంట్ రూ. 9500-9600, 60-70 కౌంట్ రూ. 9900-10,000, కళ్యాణి రూ. 7300-7400, కె-6 మిక్స్ సరుకు రూ. 8500-8600, 90-100 కౌంట్ రూ. 8700-8800 మరియు రాజస్తాన్లోని జైపూర్, భికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుసెనగ రూ. 4700-5200, హెచ్పిఎస్ 40-50 కౌంట్ రూ. 7700, 50-60 కౌంట్ రూ. 7500, 60-65 కౌంట్ రూ. 7300, 60-70 కౌంట్ రూ. 7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:45 am
నాణ్యమైన చింతపండుకు డిమాండ్ - ఎగబాకుతున్న ధరలు

హైదరాబాద్ : దక్షిణాది రాష్ట్రాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున కొత్త సరుకు కోతల ప్రక్రియ జాప్యమవుతున్నది. దేశవ్యాప్తంగా మట్రోనగరాల కిరాణా మార్కెట్లలో రంగు సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ మార్కెట్లో గత వారం 25-30, పుంగనూరులో 20-25, సాలూరులో 10-15 వాహనాలు కలిసి మొత్తం 70-75 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమి ఫ్లవర్ రూ. 10,000-10,100, మీడియుం రూ. 8000, సాధారణ రకం రూ. 7000, గింజ సరుకు రూ. 4000-4200, రంగు వెలిసిన సరుకు రూ. 3600-3800, హిందుపూర్లో సిల్వర్ మేలిమి రకం రూ. 20,000-27,000, మేలిమి రకం రూ. 15,000-18,000, మీడియం బెస్ట్ రూ. 14,500-15,000, సాధారణ రకం రూ. 11,000-13,500, హిందూపూర్ స్థానిక మ్జార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్డ్ రూ. 11,500-12,000, మహారాష్ట్ర సరుకు రూ. 12,500, ఫ్లవర్ రూ. 8500-9500, గింజ సరుకు రూ. 4200-4600, మహారాష్ట్ర సరుకు రూ. 4800-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ 11-12 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 9000- 10,500, కర్ణాటక సరుకు రూ. 7500-10,000, మహారాష్ట్ర సరుకు రూ. 9000- 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంవ్లో 2-3 వేల బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ రూ. 8500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 12,000-12,500, తుమకూరులో మేలిమి రకం రూ. 16,000-18,000, మీడియం రూ. 12,500-13,000, బార్షీలో మార్చి నెల సరుకు రూ. 10,000-10,500, ఏప్రిల్ రూ. 9500-9800, మే రూ. 9000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10-15 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు రూ. 4000-4200, మీడియం రూ. 3400-3800, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ రూ. 11,000, మీడియం సరుకు రూ. 8000-8500, గింజ సరుకు రూ. 3800-4200, తరానాలో 3-4 వాహనాల గింజ సరుకు అమ్మకంపై రూ. 4150-4250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. ప్రస్తుతం తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు చింతపండు తయారీ కష్టతరమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 30-35 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 9000, మహారాష్ట్ర సరుకు రూ. 9800-10,000, గింజ సరుకు స్థానికంగా రూ. 3800-4000, మహారాష్ట్ర సరుకు రూ. 4500-4700, నలగ్గొట్టని చింతపండు స్థానికంగా రూ. 2500-2600, మహారాష్ట్ర సరుకు రూ. 3500-3700, క్రిష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు రూ. 5500-6200, చపాతీ రూ. 4500-4700, మీడియం రూ. 3800-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు ః గత వారం కర్మాగారాల కొనుగోళ్లు కొరవడినందున చింతగింజల ధర ప్రతి క్వింటాలుకు రూ. 100-150 పతనమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు రూ. 3400, పప్పు సూరత్ డెలివరి రూ. 6200, పొడి రూ. 7500-7600, సాలూరులో చింతగింజలు రూ. 3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బార్షీ డెలివరి రూ. 3800, బార్షీలో పప్పు రూ. 6200-6300, పొడి రూ. 6300-6400, తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు రూ. 3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:44 am
ధనియాల కొనుగోళ్లు నామమాత్రమే

హైదరాబాద్ : గుజరాత్లో ధనియాల సేద్యం గత ఏడాదితో పోలిస్తే తగ్గినందున స్టాకిస్టులు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్లో సేద్యంపై స్పష్టత లేనప్పటికీ సంతృప్తికరంగానే విస్తరించగలదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. పాత సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున సీజన్ పర్యంతం ధరలు నిలకడగా కొనసాగగలవని చెప్పవచ్చు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 7884 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 196 వృద్ధి చెంది 8080, ఏప్రిల్ వాయిదా రూ. 62 పెరిగి రూ. 8600 వద్ద ముగిసింది. రాజస్తాన్లోని రామ్గంజ్మండిలో గత వారం 15-16 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు రూ. 6900-7100, ఈగల్ రూ. 7300-7400, స్కూటర్ రకం రూ. 7800-8000, కోటాలో 3-4 వేల బస్తాలు, బారన్లో 4-5 వేల బస్తాలు రాబడిపై బాదామీ రూ. 6600-7000, ఈగల్ రూ. 7200-7500 ప్రతి క్వింటాలు మరియు బాదామీ 40 కిలోలు లారీ బిల్టి రూ. 3450, ఈగల్ రూ. 3650, స్కూటర్ రకం రూ. 3800 మరియు ప్రతి క్వింటాలు ధనియూల పప్పు బాదామీ రూ. 7600, ఈగల్ రూ. 7800, స్కూటర్ రకం రూ. 7800 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గునా మార్కెట్లో 8-9 వేల బస్తాలు, కుంభరాజ్లో 7-8 వేల బస్తాలు, నీమచ్లో 4-5 వేల బస్తాలు, బినాగంజ్లో 500-600 బస్తాలు, మందసోర్లో 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 6800-7200, ఈగల్ రూ. 7300-7600, స్కూటర్ రకం రూ. 7700-8100 ఆకుపచ్చ సరుకు రూ. 8600-9500 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని గోండల్ మార్కెట్లో 17-18 వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ రూ. 7000-7300, ఈగల్+ రూ. 7400-7500, స్కూటర్ రకం రూ. 7800-8000, ఆకుపచ్చ సరుకు రూ. 8500-9500, రాజ్కోట్లో 5-6 వేలు జునాగఢ్లో 3-4 వేల బస్తాలు మరియు ఇతర మార్కెట్లలో 8-10 వేల బస్తాలు బాదామీ రూ. 6600-6800, ఈగల్ రూ. 7000-7250, ఈగల్+ రూ. 7500-7700, స్కూటర్ రూ. 7800-7875, ఆకుపచ్చ సరుకు రూ. 8300-9250 ప్రతి క్వింటాలు వురియుు ఆంధ్ర లోని ఒంగోలులో బాదామీ ధనియూలు రూ. 3625, ఈగల్ రూ. 3700, స్కూటర్ రకం రూ. 3780, ఎసి సరుకు రూ. 3650 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:50 am
సాధారణ కొనుగోళ్లతో స్థిరత్వం చేకూరిన మిర్చి ధరలు

హైదరాబాద్ : ప్రస్తుతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సరఫరా వృద్ధి చెందినప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారడంలేదు. అయితే, మసాలా తయారీదారులు మరియు కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో మసాలా తయారీదారుల నుండి నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలు, తీప్రమైన చలి వీస్తున్నందున ఆశించిన స్థాయిలో సరుకు రాబడి కావడంలేదు. కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ జోరందుకున్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతుల సరుకు తగ్గాయి. వచ్చే వారం నుండి పెరగగలవని తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో డీలక్స్ రకాలదే పైచేయిగా ఉంది. శీతల గిడ్డంగుల నుండి మీడియం, మీడియం బెస్ట్ రకాల రాబడులు అధికంగా అవుతున్నాయి. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారం అవుతున్నందున ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు శీతల గిడ్డంగులలో దాదాపు 25-26 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ సరుకు సరఫరా జనవరి నుండి పోటెత్తవచ్చని తెలుస్తోంది. గత వారం గుంటూరు మార్కెట్ యార్డులో కేవలం నాలుగు రోజుల లావాదేవీలలో 1.50 లక్షల బస్తాలు, పరిసర శీతల గిడ్డంగుల నుండి 60 వేల బస్తాలు కలిసి మొత్తం 2.10 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 1.85 లక్షల బస్తాలు అమ్మకమైంది. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ రూ. 12,500-16,000, అత్యధిక సరుకు రూ. 14,000-15,500, బడిగ-355 రూ. 9000-11,500, సింజెంట బడిగ-5531 రూ. 9000-13,000, డిడి రూ. 10,000-13,000, 341 రూ. 10,000-15,000, నెంబర్-5 రూ. 10,000-14,000, కుబేరా, 273 రూ. 9000-11,000, సూపర్-10, 334 రూ. 13,500-14,500, మీడియం, మీడియం బెస్ట్ రూ. 11,500-13,000, ఆర్మూరు రూ. 10,000-12,000, స్పార్క్-శార్క్ రూ. 12,000-14,500, రోమి రూ. 12,500-15,000, బడిగ-2043 రూ. 10,000-12,000, క్లాసిక్ రూ. 8000-11,000, బుల్లెట్, బంగారం రూ. 9000-13,500, ఎఫ్బి రూ. 6500-8500, తాలు కాయలు తేజ రూ. 7500-8500, ఇతర రకాలు రూ. 3500-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాలలో 56 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 52 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. తేజ, 341, డిడి లాంటి డీలక్స్ రకాలకు డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు రూ. 13,000-16,000, డీలక్స్ రూ. 16,200-16,300, డిడి రూ. 12,000-14,500, సింజెంట బడిగ-5531 రూ. 10,000-13,000, ఆర్మూరు, బడిగ-355 రూ. 10,000-12,000, సూపర్-10, 334 రూ. 11,000-13,000, స్పార్క్-షార్క్ రూ. 10,000-13,000, కుబేరా, 273 రూ. 10,000-12,000, సీడ్ రకాలు మీడియం రూ. 8000-11,000, బడిగ-273 రూ. 10,000-12,000, తాలు కాయలు తేజ రూ. 8000-10,000, డీలక్స్ రూ. 10,500, సాధారణ రకాలు రూ. 4500-7000, డీలక్స్ రూ. 7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం 3-4 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 16,011, తాలు కాయలు రూ. 7000-8000 మరియు 30-35 వేల బస్తాల శీతలగిడ్డంగల సరుకు అవ్ముకం కాగా, తేజ నాణ్యమైన సరుకు రూ. 16,000, మీడియం రూ. 15,000-15,500, తాలు కాయలు రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 2 వేల బస్తాల కొత్త మిర్చి తేజ రూ. 14,000-16,000, 341 రూ. 12,000-14,000 మరియు 25-30 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,000-15,500, మీడియం రూ. 11,000-13,300, 341 నాణ్యమైన సరుకు రూ. 11,500-14,500, 5531 రూ. 10,000-12,000, అగ్ని రూ. 11,000-12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు వుహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి 7-8 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా , సీడ్ క్వాలిటీ నివుు్మ సరుకు రూ. 8000-12,000, తేజ రూ. 12,000-16,000, ఆర్మూర్ రకం రూ. 10,000-12,300, డిడి రూ. 9000-14,000, బడిగ-2043, డిడి రూ. 11,000-14,000, 273 సింజంట రూ. 10,000-12,000, తాలు కాయులు తేజ రూ. 6000-8000, ఇతర రకాలు రూ. 3000-5500 వురియుు 2 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-15,000, ఆర్మూర్ రూ. 10,500-12,000, సింజెంట రూ. 10,000-12,000, సూపర్-10 రూ. 10,000-14,000, డిడి, 341, రూ. 10,000-13,000, 273 రకం రూ. 10,000-12,000, 2043 నాణ్యమైన సరుకు రూ. 10,000-12,500, తాలు కాయులు సీడ్ రూ. 4000-5000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్గీలో సోవు, గురువారాలలో కలిసి 0.95-1.00 లక్ష బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి రూ. 32,000-35,000, 5531 నాణ్యమైన సరుకు రూ. 9,500-13,000, కెడిఎల్ డీలక్స్ రూ. 28,000-31,000, నాణ్యమైన సరుకు రూ. 20,000-24,000, మీడియం రూ. 9000-11,500, 2043 రూ. 10,000-13,000, డిడి రూ. 12,500-14,000, తాలు కాయలు 5531 రూ. 5500-7500, 2043, కెడిఎల్ రూ. 2500-4000 మరియు 30-35 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 20 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బి రూ. 18,000-21,000, మీడియం 16,000-17,000, కెడిఎల్ రూ. 14,000- 16,000, 2043 రూ. 10,000-13,000, 5531 రూ. 9000-11,500, తాలు కాయలు సీడ్ రూ. 5000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై సానియా రూ. 12,000-14,000, రవ్వ రూ. 12,500-15,000, మీడియం రూ. 9000-11,000, తాలు కాయలు రూ. 3500-6000, మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం 20-25 వాహనాల మిర్చి రాబడిపై తేజ రూ. 13,000-15,000, మీడియం రూ. 8000-8500, నందూర్బార్లో 4-5 వేల క్వింటాళ్లు తేజ నిమ్ము సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 3000-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 40-45 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై వుహి ఫుల్కట్ రూ. 14,500-16,800, మీడియుం రూ. 8500-11,000, తొడిమె సరుకు రూ. 10,500-13,000, తొడిమె తీసిన తాలు కాయులు రూ. 6500-7500, తొడిమె సరుకు రూ. 6000-7000 వురియుు ధామనోద్, ఇండోర్, కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి 10-12 వేల బస్తాల సరుకు రాబడి కాగా, వుహీ రూ. 16,000- 16,500, మీడియుం రూ. 18,000, లాల్కట్ రూ. 17,000- 17,500, తాలు కాయులు రూ. 5500-6000, బోల్డు సరుకు రూ. 4000-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3-4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 14,000-16,000, 4884 రూ. 9000-12,000, తాలు కాయులు తేజ రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:50 am
భారీగా విస్తరించిన శనగ సేద్యం - స్టాకిస్టుల అమ్మకాలపై ఒత్తిడి

హైదరాబాద్ : దేశంలో డిసెంబర్ 20 నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 84.42 ల.హె. నుండి పెరిగి 86 ల.హె.లో విస్తరించింది. ఇందులో కర్ణాటకలో 9.41 ల.హె. నుండి 10.34 ల.హె.లో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 2024 అక్టోబర్లో ఆస్ట్రేలియా నుండి 1,09,622 టన్నుల శనగలు ఎగుమతి చేయగా ఇందులో భారత్కు 82,481 టన్నులు ఎగుమతి చేసిందని ఆస్ట్రేలియాకు చెందిన ఏజెన్సీ వెల్లడించింది. సేద్యం సంతృప్తికరంగా విస్తరించడంతో పాటు ఆస్ట్రేలియా, కెనడా లాంటి ఉత్పాదక దేశాల నుండి సరుకు దిగుమతి అవుతున్నందున శనగల ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. కొత్త సీజన్లో పెరుగుతున్న ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ధర రూ. 5000 దిగువన చలించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం జెజె శనగలు సేలం, మదురై, విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 7100, కర్ణాటక సరుకు రూ. 7250, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6500-6600, ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6250, పాత సరుకు రూ. 6100, ఆస్ట్రేలియా కొత్త శనగలు రూ. 6500, సూడాన్ కాబూలీ శనగలు రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర శనగలు తమిళనాడులోని సేలం, మదురై విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 7000, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 7300, య్యుడికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6500-6550, ముంబైలో రూ. 6050, ఆస్ట్రేలియా నుండి దిగుమతి సరుకు రూ. 6250, సూడాన్ కాబూలీ శనగలు రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 6300- 6500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 8300, డాలర్ శనగలు రూ. 11,800, హైదరాబాద్లో మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల సరుకు రూ. 6600-6650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం 50-55 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్లోని శెఖావటి శనగలు రూ. 6750-6775, మధ్యప్రదేశ్ సరుకు రూ. 6650-6675 మరియు వుధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ శనగలు రూ. 6350- 6600,, డాలర్ శనగలు రూ. 11,000- 12,700, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 14,100, 42-44 కౌంట్ రూ. 13,900, 44-46 కౌంట్ రూ. 13,600, 46-48 కౌంట్ రూ. 13,300, 50-52 కౌంట్ రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వుహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు రూ. 6500-6650, అన్నిగిరి శనగలు రూ. 6700-7000, అకోలాలో ప్రతి రోజు 2500-3000 బస్తాలు మిక్స్ శనగలు రూ. 6500, సాధారణ రకం రూ. 6000, పప్పు రూ. 8000-8200, రాజస్తాన్లోని కోటాలో రూ. 5000-6800, జైపూర్లో రూ. 6700-6750, పప్పు రూ. 7525, గుజరాత్లోని రాజ్కోట్లో దేశీ శనగలు రూ. 6200-6500, దాహోద్లో శనగలు రూ. 6100-6400 మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్, ఝాన్సీలో రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:49 am