హైదరాబాద్ : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వారంలో 100 వాహనాల బెల్లం సరఫరా అవుతున్నది. దీనికి తోడు ఇతర రాష్ట్రాలలో శీతల గిడ్డంగుల సరుకు అమ్మకమవుతున్నందున ధరలు నిలకడగా కొనాసాగుతున్నాయి. ఉత్పాదక కేంద్రాల వద్ద కొనుగోళ్లు కొరవడినందున ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది. కర్ణాటకలోని శిమోగాలో గత వారం 14 వాహనాల సరుకు రాబడిపై దేశీ బెల్లం రూ. 4200-4250, మాండ్యాలో 30 వాహనాలు రూ. 3800-4300ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది.మహారాష్ట్రలోని లాతూర్‌లో 8 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రకం సరుకు రూ. 4500-4600, మీడియం రూ. 4200-4300, ఎరుపు-పసుపు మిక్స్ సరుకు రూ. 3900-4000, సోలాపూర్‌లో 4 వేల దిమ్మలు సురభి రకం రూ. 4300-4400, మీడియం రూ. 4000-4100, సాంగ్లీలో రూ. 3900-4300 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో 20 వాహనాల సరుకు ఆర్గానిక్ సూపర్-ఫైన్ బెల్లం రూ. 5400, సురభి రూ. 4900-5000, నలుపు రూ. 4100-4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.ముజఫర్‌నగర్‌లో చాకూ బెల్లం కొత్త సరుకు ప్రతి 40 కిలోలు రూ. 1600-1750, రస్‌కట్ అచ్చులు రూ. 1400-1450, ముద్ద్డబెల్లం రూ. 1600-1700, ఖరుపా రూ. 1500-1600 మరియు పాప్‌డి 100 కిలోలు రూ. 4000-4100 మరియు మధ్యప్రదేశ్లోని బైతుల్లో ప్రతి రోజు 300 క్వింటాళ్లు రాబడిపై రూ. 3855-4021, దిల్లీలో ప్రతి రోజు 800 బస్తాలు ముద్దబెల్లం రూ. 4600-4700, చాకూ బెల్లం రూ. 4700-4800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ శీతల గిడ్డంగులలో ఆగస్టు 11 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాదితో ఇదే వ్యవధితో పోలిస్తే 7 లక్షల 66 వేల 966 నుండి 2 లక్షల 11 వేల 567 తగ్గి 5 లక్షల 55 వేల 399 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం 3 లక్షల 44 వేల 801 నుండి తగ్గి 2 లక్షల 69 వేల 641, పాప్‌డి 1 లక్ష 26 వేల 554 నుండి 87 వేల 296, రస్‌కట్ 24 వేల 96 నుండి 23 వేల 714, రాబిటన్ 1 లక్ష 69 వేల 227 నుండి 1 లక్ష 8 వేల 625, చదరాలు 76 వేల 762 నుండి 61 వేల 633, బస్తాల ఖరుపా 3 వేల 518 నుండి 4 వేల 204 బస్తాల సరుకు అందుబాటులో ఉంది.
Updated On: August 18, 2025, 6:30 amగుంటూరు : రాబోయే సీజన్ కోసం కోసుకుపోనున్న సేద్య పరిధి మరియు మసాలా తయారీదారులతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కొనుగోళ్లు జోరందుకున్నందున గత వారం డీలక్స్ రకాలతో పాటు అన్ని మీడియం, మీడియం బెస్ట్, తాలు కాయల ధర ప్రతి క్వింటాలుకు రూ. 300-500 వృద్ధి నమోదైంది. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది. గుంటూరు శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు 42 నుండి 43 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు సవూచారం. ఇందులో నాణ్యమైన రకాలు నామమాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరూ మార్కెట్లో గత వారం నిర్వహించిన నాలుగు రోజుల లావాదేవీలలో 1 లక్ష 90 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 80 వేల బస్తాలు కలిసి మొత్తం 2 లక్షల 70 వేల బస్తాల మిర్చి రాబడి కాగా 2 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో ఈ ఏడాది డీలక్స్ రకానికి కేవలం 20-30 శాతం సరుకు మాత్రమే అమ్మకమైంది. డీలక్స్ రకాల ధరలు మరింత ఇనుమడించే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు. గుంటూరు మార్కెట్‌లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ రూ. 11,000- 13,800, డీలక్స్ రూ. 13,900-14,000, ఎక్స్ట్రాడినరి రూ. 14,100- 14,200, అత్యధిక సరుకు రూ. 12,000-13,500, బడిగ-355 రూ. 10,000-13,000, సింజెంట బడిగ-5531 రూ. 10,000-12,800, డిడి రూ. 11,000-14,000, బడిగ-2043 రూ. 10,000-13,000, డీలక్స్ రూ. 13,500, 341 రూ. 11,000-14,500, డీలక్స్ రూ. 14,600-15,000, నెం. 5 రూ. 11,000-14,000, డీలక్స్ రూ. 14,200-14,500, 264 (నెం. 5 రకం) రూ. 10,000-13,000, డీలక్స్ రూ. 13,500, కుబేరా, 273 రూ. 10,000-13,000, సూపర్-10, 334 రూ. 11,000-13,000, డీలక్స్ రూ. 13,500-14,000, ఆర్మూరు రకం రూ. 10,000-11,200, డీలక్స్ రూ. 11,300- 11,600, రోమి రూ. 12,000-13,500, డీలక్స్ రూ. 13,600-13,800, స్పార్క్-షార్క్ రూ. 11,000-12,800, డీలక్స్ రూ. 13,000, క్లాసిక్ రూ. 10,000-11,200, డీలక్స్ రూ. 11,300 -11,500, బంగారం, బుల్లెట్ రూ. 10,500-13,000, డీలక్స్ రూ. 13,500, పసుపు పచ్చ సరుకు రూ. 20,000-23,000, తాలు కాయలు తేజ రూ. 7500-8500, డీలక్స్ రూ. 9000, ఇతర రకాలు రూ. 4500-7000 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడిలో గత ఆదివారం తేజ రూ. 14,250, ఆర్మూరు రకం రూ. 11,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 28 వేల బస్తాల ఎసి మిర్చి రాబడి కాగా 18 వేల బస్తాలు సరుకు అమ్మకమైంది. తేజ నాణ్యమైన సరుకు రూ. 14,500, మీడియం రూ. 13,500-14,000, తాలు కాయలు రూ. 7000-7500 మరియు 1500 బస్తాల రైతుల సరుకు రూ. 8500-9000, వరంగల్‌లో 25 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 14,000, మీడియం రూ. 12,000-13,800, 341 రూ. 12,000-14,000, వండర్‌హాట్ నాణ్యమైన సరుకు రూ. 14,500, మీడియం రూ. 12,500-14,000, 5531 రకం రూ. 11,500, దీపిక రూ. 13,500, మీడియం రూ. 11,000-12,500, చపాటా నాణ్యమైన సరుకు రూ. 26,000, ఎఫ్బి రూ. 15,000-25,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్‌కు వుహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 1000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 12,000-13,500, సూపర్-10 రూ. 12,000-13,000, ఆర్మూర్ రకం రూ. 10,000-11,000, 273 రూ. 10,000-11,500, సి-5 రూ. 11,000-13,000, 341 రూ. 12,500- 13,000, 2043 రూ. 11,000-14,000, సింజెంట రూ. 11,000-11,500, తాలు కాయులు తేజ రూ. 6000-7000, సూపర్-10 రూ. 4000-6000, సింజెంట రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.కర్ణాటకలోని బ్యాడ్గీలో గత సోమ, గురువారాలలో కలిసి 28 వేల బస్తాల ఎసి మిర్చి రాబడిపై 18 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా 2043 రూ. 10,000-13,000, బడిగ-5531 రూ. 9500-11,500, డీలక్స్ రూ. 12,500, డబ్బి మీడియం బెస్ట్ రూ. 15,000-18,000, డీలక్స్ రూ. 24,000, కెడిఎల్ రూ. 14,000-19,000, డీలక్స్ రూ. 20,000-22,000, తాలు కాయలు సీడ్ రకాలు 5000-6000, బడిగ రూ. 4000-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో 1000 బస్తాల ఎసి మిర్చి అమ్మకంపై తేజ రూ. 12,000-14,000, షార్క్-1 రూ. 10,500-12,500, తాలు కాయలు తేజ రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:29 amహైదరాబాద్ : ఉత్పాదక కేంద్రాల వద్ద కొనుగోళ్లు కొరవడినందున గత వారం పసుపు ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-300 పతనమైంది. ఎన్‌సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 12,982 తో ప్రారంభమై గురువారం నాటికి రూ. 368 తగ్గి రూ. 12,614, అక్టోబర్ వాయిదా రూ. 2 వృద్ధి చెంది రూ. 13,350 వద్ద స్థిరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్‌లో గత వారం 5 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 11,200-13,200, దుంపలు రూ. 10,500-11,200, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 14,100-14,200, దుంపలు రూ. 13,100-13,200, వరంగల్‌లో కొమ్ములు, దుంపలు రూ. 10,500-11,000, దుంపలు రూ. 10,000-10,600, సదాశివపేట, వికారాబాద్, మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు, దుంపలు రూ. 10,200-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళి 10 వేల బస్తాల సరుకు అమ్మకంపె కొమ్ములు రూ. 11,500-12,200, దుంపలు రూ. 11,200-11,800, నాందేడ్‌లో 7 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 11,300-11,600, దుంపలు రూ. 11,000-11,300, సాంగ్లీలో 1000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 13,500-14,000, దుంపలు రూ. 13,000-13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్‌లో 15 వేల బస్తాలు కొమ్ములు రూ. 9399-13,809, దుంపలు రూ. 8066-12,158, పెరుందురైలో 8 వేల బస్తాలు కొమ్ములు రూ. 8319-13,699, దుంపలు రూ. 7789-12,289, గోబిచెట్టిపాలయంలో 400 బస్తాలు కొమ్ములు రూ. 12,303-12,755, దుంపలు రూ. 11,144-11,666 మరియు ఒడిశ్శాలోని బరంపురంలో 700 బస్తాలు కొమ్ములు రూ. 11,200, పాలిష్ సరుకు కొమ్ములు రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:28 amహైదరాబాద్ : గడిచిన రెండు-మూడు నెలలుగా ఆగస్టు, సెప్టెంబర్ వాయిదా విక్రేతలు కొనుగోలుదారుల నుండి ఎన్‌సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 7802 తో ప్రారంభమైన తర్వాత గురువారం నాటికి రూ. 428 వృద్ధి చెంది రూ. 8230, సెప్టెంబర్ వాయిదా రూ. 38 పెరిగి రూ. 7870, అక్టోబర్ రూ. 7920 వద్ద కదలాడుతున్నది. రాజస్తాన్లోని రామ్‌గంజ్‌మండి, కోటా, బారన్ ప్రాంతాలలో గత వారం 7 వేల బస్తాల ధనియాల రాబడిపై బాదామీ రూ. 6800-7100, ఈగల్ రూ. 7100-7400, స్కూటర్ రకం రూ. 7400-7500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు తమిళనాడు కోసం లారీ బిల్టి లోడింగ్ కండిషన్‌పై ప్రతి 40 కిలోల బస్తా బాదామీ రూ. 3600, ఈగల్ రూ. 3650 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్, కుంభరాజ్, గునా, బినాగంజ్, మందసోర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 4 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 6800- 6900, ఈగల్ రూ. 7100-7200 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో బాదామీ ధనియాలు కొత్త సరుకు ప్రతి 40 కిలోలు రూ. 3625, ఈగల్ రూ. 3675, స్కూటర్ రకం రూ. 3775 మరియు ఎసి సరుకు బాదామీ రూ. 3625 ధరతో వ్యాపారమైంది. శ్రీక్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా గత వారం గుజారాత్ మార్కెట్ మూసువేయబడింది.
Updated On: August 18, 2025, 6:27 amహైదరాబాద్ : కర్ణాటకలోని మైసూరు ప్రాంతం కొత్త మినుములు చెన్నై డెలివరి రూ. 7500-7600, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల ప్రాంతం కొత్త సరుకు పియు-38 రకం రూ. 7450, మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ గ్రేడింగ్ చేసిన సరుకు రూ. 7900, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రాంతం కొత్త మినుములు రూ. 8000, చెన్నైలో బ్రెజిల్ సరుకు రూ. 8100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలోని పలు ప్రాంతాలలో పంట కోతల తరుణంలో వర్షాలు కురుస్తున్నందున పంటకు నష్టం వాటిల్లే అంచనా మరియు విదేశీ ఎగుమతి వ్యాపారులు అధిక ధరలు ప్రతిపాదిస్తున్నారు. తద్వారా దేశీయ మార్కెట్లో ధరలకు మద్దతు లభిస్తున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ విపణిలో ఎస్‌క్యూ మినుములు ప్రతి టన్ను 865 డాలర్, ఎఫ్‌ఎక్యూ 790 డాలర్ ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో రూ. 150 పెరిగి ఎఫ్‌ఎక్యూ మినుములు రూ. 7300, చెన్నైలో రూ. 7250, ఎస్‌క్యూ 7700, దిల్లీలో ఎఫ్‌ఎక్యూ రూ. 7450, ఎస్‌క్యూ రూ. 7950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో ఆగస్టు 8 నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 లక్షల 91 వేల హెక్టార్ల నుండి పెరిగి 20 లక్షల 15 వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. రాష్ట్రాల వారీగా విస్తరించిన సేద్యం ః గుజరాత్‌లో ఆగస్టు 11 నాటికి 81 వేల 72 నుండి తగ్గి 70 వేల 727 హెక్టార్లు, రాజస్తాన్‌లో 2 లక్షల 97 వేల 379 నుండి పెరిగి 3 లక్షల 12 వేల 786 హెక్టార్లు, తెలంగాణలో ఆగస్టు 13 నాటికి 19 వేల 411 ఎకరాల నుండి 21 వేల 625 ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో దేశీ మినుములు రూ. 6200-6800, ఉరైలో ఆకుపచ్చ సరుకు రూ. 10,000-10,300, ఝాన్సీలో నలుపు సరుకు 6200-6500 మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 4 వేల సరుకు రాబడిపై రూ. 6800-7200, ఇండోర్‌లో రూ. 6700-7000, గుజరాత్లోని రాజ్కోట్లో 700 బస్తాలు రూ. 6500-7200, రాజస్తాన్లోని కేక్డిలో రూ. 6100-6600, కోటాలో రూ. 4000-6600 మరియు మహారాష్ట్రలోని దూధ్నిలో ప్రతి రోజు 300 బస్తాలు కొత్త సరుకు రాబడిపై 6800-7300, బార్షీలో రూ. 6000-7000, అకల్కోట్లో రూ. 7000-7500 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా, నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు రూ. 7100, అన్-పాలిష్ సరుకు రూ. 6900, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 9800, నాణ్యమైన సరుకు రూ. 13,200, పప్పు రూ. 9200-10,100 ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:25 amహైదరాబాద్ : దేశంలో ఆగస్టు 8 నాటికి ఖరీఫ్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32 లక్షల 33 వేల నుండి పెరిగి 33 లక్షల 21 వేల హెక్టార్లు మరియు మిటుకులు 8 లక్షల 4 వేల హెక్టార్ల నుండి 9 లక్షల 6 వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పెసల సేద్యం ః గుజరాత్‌లో ఆగస్టు 11 నాటికి 51 వేల 344 నుండి తగ్గి 46 వేల 121 హెక్టార్లు, రాజస్తాన్‌లో 21 లక్షల 96 వేల 830 నుండి 23 లక్షల 51 వేల 729 హెక్టార్లు, మిటుకులు 8 లక్షల 58 వేల 230 నుండి 9 లక్షల 4 వేల 269 హెక్టార్లు, తెలంగాణలో ఆగస్టు 13 నాటికి 63 వేల 222 ఎకరాల నుండి తగ్గి 58 వేల 546 ఎకరాలలో విస్తరించినట్లు ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. కర్ణాటక మరియు మహారాష్ట్ర ఉత్పాదక కేంద్రాల వద్ద పెరిగిన ఖరీఫ్ సీజన్ పెసల రాబడులు మరియు పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 50-100 పతనమైంది. కర్ణాటకలోని కల్బుర్గి, సేడెం ప్రాంతాలలో మొగులాయి పెసలు కొత్త సరుకు చెన్నై డెలివరి రూ. 7700, 90ః10 పాలిష్ సరుకు రూ. 9500, 80ః20 రకం రూ. 9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో ప్రతి రోజు 2500 బస్తాల పెసలు రాబడిపై కొత్త సరుకు రూ. 6000-8500, పాత సరుకు రూ. 3500-6500, యాద్గిర్లో 4200 బస్తాల సరుకు రాబడిపై రూ. 6311-9650, బాగల్కోట్లో రూ. 8700-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ (అహల్యనగర్)లో ప్రతి రోజు 800 బస్తాల యాసంగి పెసలు రాబడిపై రూ. 6000-8300, జబల్పూర్లో 1500 బస్తాలు రూ. 7200-7300, లాతూర్‌లో రూ. 7000-7300, అకోలాలో మిల్లు రకం పెసలు రూ. 6000-7450, పాలిష్ సరుకు రూ. 7600-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని హర్దాలో ప్రతి రోజు 700 బస్తాల యాసంగి పెసలు రాబడిపై రూ. 6000-8300, జబల్పూర్లో 1500 బస్తా రూ. 7200-7300, ఇండోర్‌లో రూ. 7500-8100 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి రోజు 700 బస్తాలు రూ. 6500-7200, మిటుకులు 500 బస్తాలు రూ. 6000-10,000, దాహోద్‌లో పెసలు రూ. 7000-7600 మరియు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో రూ. 6500-7500, ఉరైలో రూ. 7000-7075 మరియు రాజస్తాన్లోని సుమేర్‌పూర్‌లో రూ. 6200-6800, కేక్డిలో 400 బస్తాలు రూ. 6500-7000, నాగోర్‌లో 600 బస్తాలు రూ. 6400-8500, మెడతాలో రూ. 6500-7100, జోధ్‌పూర్‌లో రూ. 6200-7050, మోగర్ పెసలు రూ. 9500-9550, మిటుకులు 4000-5000, కిషన్గఢ్లో పెసలు రూ. 5000-6800, బికనీర్‌లో రూ. 6700-6900, శ్రీగంగానగర్, జైపూర్‌లో రూ. 6900-7200, పప్పు రూ. 8400-8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:25 amముంబై : 2024-25 సీజన్ కోసం ఈ ఏడాది జనవరి 20న 10 లక్షల టన్నుల పంచదార ఎగుమతి చేసేందుకు కేంద్ర సర్కారు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 6 లక్షల 44 వేల టన్నుల సరుకు ఎగుమతి చేయగా ఇందులో సోమవారం అత్యధికంగా 1 లక్ష 26 టన్నులు నమోదు చేసింది. ప్రస్తుత వ్యవస్థ ఎగుమతులకు అనుకూలంగా లేకపోవడంతో మిల్లుల లాభాలు ప్రభావితమవుతున్నందున పంచదార ఎగుమతి కోటా వారి సొంత సౌకర్యాలు అందుబాటులో ఉన్న మిల్లులకు మాత్రమే కేటాయించాలని అఖిల భారత పంచదార వర్తక సంఘం (ఎఐఎస్టిఎ) ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుత కోటా విధానంలో వెనుకబడిన ప్రాంతంలోని మిల్లులు తమ కోటా ఇతర మిల్లులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నందున గత ఉత్పత్తి ఆధారంగా అన్ని మిల్లులకు పరిమిత పరిమాణం మాత్రమే ఎగుమతి చేయగలవు. ప్రస్తుతం పంచదార ఎగుమతులు పరిమితం చేయబడిన శ్రేణిలో ఉన్నాయి. ప్రభుత్వం మరియు పంచదార మిల్లర్ల మధ్య కోటా పంపిణీ నిష్పత్తి ద్వారా పరిమాణం కేటాయిస్తుంది. గత ఏడాది జనవరి 15 నుండి సి-హైవి మొలాసిస్ 50 శాతం ఎగుమతి సుంకం విధించడం కూడా భావ్యం కాదని ఎఐఎస్టిఎ పేర్కొన్నది. ఈ పరిణామం ఎగుమతులు పెరగడానికి దోహదపడదని, ఇథనాల్ ప్రక్రియలో సి-ెహైవి మొలాసిస్ భాగస్వామ్యం ఎగుమతులకు అవరోధం కలిగిస్తున్న దని ఎఐఎస్టిఎ పేర్కొన్నది. భారత్‌లోని ఇథనాల్ ప్రక్రియలో సి-హైవి భాగస్వామ్యం 2 శాతం కూడా లేదని డిస్టిలరీ చేయని ఎగుమతులకు నియంత్రించడం వలన మిల్లర్లు నష్టాలు మూట గట్టుకోవలసి వస్తోంది.
Updated On: August 18, 2025, 6:24 amన్యూదిల్లీ : 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి పసుపు ఎగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే 1 లక్షల 62 వేల టన్నుల నుండి పెరిగి 1 లక్ష 76 వేల టన్నులకు చేరగా విలువ దృష్ట్యా 22 కోట్ల 65 లక్షల 80 వేల డాలర్ నుండి 50.7 శాతం పెరిగి 34 కోట్ల 15 లక్షల 40 డాలర్‌కు చేరాయని ఇటీవల వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి జితిన్ ప్రసాద్ లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మసాలా ఎగుమతుల అభివృద్ధి కోసం ప్రగతిశీల వినూత్న సహకార సంఘాల ద్వారా మసాలాల రంగంలో స్థిరత్వం చేకూర్చడం కోసం మసాలా బోర్డు మసాలాల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నదని మంత్రి తెలిపారు. 2020 లో భారత పసుపు కోసం బంగ్లాదేశ్, యుఎఇ, అమెరికా మలేషియా, మొరాకో ప్రముఖ దిగుమతి దేశాలుగా అగ్రగామిగా నిలిచాయి. ప్రపంచ మార్కెట్లో భారత భాగస్వామ్యం 66 శాతం ఉంది. పసుపు ఎగుమతులకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వ లక్ష్యం అధిగమించేందుకు ఆహార భద్రత మరియు గుణాత్మకత, ప్రాసెసింగ్ మరియు పంట కోతల తర్వాత నాణ్యత నవీకరణ, ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపులో సహకారం అందించడంతో పాటు భాగస్వాములకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని మంత్రి తెలిపారు.పసుపులో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి మరియు విలువ జోడింపు కోసం జాతీయ పసుపు బోర్డు స్థాపించినట్లు జితిన్ ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ విపణిలో పసుపు మరియు పసుపు ఉత్పత్తుల అవగాహన పెంపొందించి వినియోగం పెంచేందుకు కార్యక్రమం చేపడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. పసుపు రైతులను నేరుగా ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానించేందుకు కొనుగోలుదారులు-విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Updated On: August 18, 2025, 6:21 amహైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో మార్కెట్‌లకు రాబడి అవుతున్న సరుకు నామమాత్రమే అని చెప్పవచ్చు. పండుగల సీజన్ కొనసాగుతున్నందున వినియోగదారుల కొనుగోళ్లు జోరందుకోవడంతో ధర ప్రతి క్వింటాలుకు రూ. 100-150 వృద్ధి నమోదైంది. గుజరాత్‌లో రుతుపవనాల సీజన్‌కు ముందస్తుగా కురిసిన వర్షాలకు విత్తిన పంట ప్రస్తుతం కోతకు సిద్ధమవుతున్నది. మరో నెల రోజులలో కొత్త సరుకు పూర్తి స్థాయిలో రాబడి కాగలదు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాలలోని అన్ని మార్కెట్‌లలో కలిసి వారంలో 70 వేల బస్తాలు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో 10 వేల బస్తాల చొప్పున కొత్త వేరుసెనగ సరుకు రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వారంలో 15 వేల బస్తాలు, ఆదోనిలో 25 వేలు, ఎమ్మిగనూరులో 30 వేలు, బొబ్బిలి, డోన్ ప్రాంతాలలో 10 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 5000-7100, మడకశిర, ఆదోని ప్రాంతాలలో హెచ్‌పిఎస్ 80-90 కౌంట్ రూ. 9700-9800, మహారాష్ట్ర కోసం 70-80 కౌంట్ రూ. 10,400-10,500, 60-70 కౌంట్ రూ. 10,700-10,800, 60-65 కౌంట్ రూ. 10,500-10,600, 50-60 కౌంట్ రూ. 11,000-11,200, 90-100 కౌంట్ రూ. 9500-9600, కళ్యాణి రూ. 8100-8200, కళ్యాణి రూ. 8100-8200, నందికొట్కూరులో 140-160 కౌంట్ రూ. 7800, 90-100 కౌంట్ రూ. 8800, 80-90 కౌంట్ రూ. 9400, 70-80 కౌంట్ రూ. 9800, 60-70 కౌంట్ రూ. 10,400, 50-60 కౌంట్ రూ. 10,900, కళ్యాణి 100-120 కౌంట్ రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్లారిలో 6 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై మీడియం రూ. 4500-6000, బెస్ట్ రూ. 6800-7200, చెల్లకేరిలో 2 వేల బసాలు రూ. 5000-7000, హెచ్‌పిఎస్ 90-100 కౌంట్ రూ. 9200-9300, 80-90 కౌంట్ రూ. 9500-9600, 70-80 కౌంట్ రూ. 9800-9900, 60-70 కౌంట్ రూ. 10,300-10,400, ఆంధ్రప్రాంతం సరుకు 60-70 కౌంట్ రూ. 10,500- 10,600, 60-65 కౌంట్ రూ. 10,700-10,800, 70-80 కౌంట్ రూ. 10,200-10,300, నరసరావుపేటలో 70-80 కౌంట్ రూ. 10,600, 60-70 కౌంట్ రూ. 11,100, 50-60 కౌంట్ రూ. 11,600 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంతం సరుకు హెచ్‌పిఎస్ 140-160 కౌంట్ రూ. 8300, 80-90 కౌంట్ రూ. 9700, 70-80 కౌంట్ రూ. 10,300, 60-65 కౌంట్ రూ. 10,600, 50-60 కౌంట్ రూ. 10,900 ధరతో వ్యాపారమైంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ప్రతి రోజు 8 వాహనాల వేరుసెనగ రాబడిపై డామ్యేజ్ సరుకు రూ. 4000-4800 మరియు ఉత్తరప్రదేశ్‌లోని ఎటా, మైన్‌పురి, మాధవ్గంజ్ ప్రాంతాల మార్కెట్‌లలో 15 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5000-5400, మీడియం రూ. 4600-4800, హెచ్‌పిఎస్ 60-70 కౌంట్ రూ. 9400, తమిళనాడు డెలివరి రూ. 9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని పూణెలో హెచ్‌పిఎస్ గుజరాత్ జాడా రకం 40-50 కౌంట్ రూ. 8400, 35-40 కౌంట్ రూ. 9000, రాజస్తాన్ జాడా 60-70 కౌంట్ తమిళనాడు కోసం 7900, 50-60 కౌంట్ రూ. 8400, 40-50 కౌంట్ రూ. 8600, ఆంధ్రప్రదేశ్ సరుకు జావా ముంబై కోసం 60-65 కౌంట్ రూ. 10,400-10,600, మహారాష్ట్ర సరుకు రూ. 9400-9500, ఉత్తరప్రదేశ్ కోసం రూ. 8800-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.గుజరాత్లోని రాజ్‌కోట్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్‌లు ఆగస్టు 17 వరకు మూసి ఉండగలవు. హెచ్‌పిఎస్ 60-70 కౌంట్ ముంద్రా డెలివరి రూ. 7900, 50-60 కౌంట్ రూ. 8000, 50-55 కౌంట్ రూ. 8100, 40-50 కౌంట్ రూ. 8200, 38-42 కౌంట్ రూ. 8600, కిశోడ్లో జావా హెచ్‌పిఎస్ 50-60 కౌంట్ రూ. 8000, 60-70 కౌంట్ రూ. 7850, 40-50 కౌంట్ రూ. 8300, 38-42 కౌంట్ రూ. 8700 ధరతో వ్యాపారమైంది. తిరువన్నామలైలో హెచ్‌పిఎస్ 80-90 కౌంట్ ఎరుపు రకం రూ. 11,600, తెలుపు సరుకు 70-80 కౌంట్ రూ. 10,000, దిండిగల్ సరుకు కేరళ కోసం 80-90 కౌంట్ (80 కిలోల బస్తా) రూ. 8400 ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:20 amన్యూదిల్లీ : నువ్వుల ఉత్పాదక రాష్ట్రాలలో గడిచిన కొన్ని రోజుల నుండి తరచుగా కురుస్తున్న వర్షాలకు పంటకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పంట పొలాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. సరుకు నాణ్యత కొరవడే అంచనాతో ధరలు ఎగబాకుతున్నాయి. పండుగల సీజన్ డిమాండ్ కొనసాగుతున్నందున నువ్వుల భవిష్యత్తు ఉండగలదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్ణాటకలోని మైసూరులో గత వారం 8 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై నాసిరకం సరుకు రూ. 8500-9000 మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్లో 10 వేల బస్తాల కొత్త నువ్వులు రాబడిపై రూ. 9800-10,400, మీడియం రూ. 9200-9600, సాధారణ రకం రూ. 8600-9000 మరియు పశ్చిమ బెంగాల్‌లో ప్రతి రోజు 5 వేల బస్తాలు ఎర్ర నువ్వులు అన్-క్లీన్ 3 ఎఫ్‌ఎఫ్ కండిషన్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 5600-6200, 2 ఎఫ్‌ఎఫ్ కండిషన్ సరుకు రూ. 6300-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, చీపురుపల్లి ప్రాంతాలలో 2 వాహనాల సరుకు రాబడిపై రూ. 8000-9300, నరసరావుపేటలో ఎర్రనువ్వులు రూ. 8500-9000, ఒంగోలులో రూ. 8600-9500 ప్రతి క్వింటాలు మరియు బద్వేలు నుండి విరుధ్‌నగర్ డెలివరి ఎర్రనువ్వులు 75 కిలోల బస్తా విరుధ్‌నగర్ డెలివరి రూ. 6800 మరియు తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి ప్రాంతాలలో 3 వాహనాల సరుకు రాబడిపై తడిసిన సరుకు రూ. 7500-8200, తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 9000-10,200 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, కాన్పూర్ ప్రాంతాలలో హళ్లింగ్ సరుకు రూ. 10,100-10,2000, 99.1 రకం సరుకు రూ. 10,400-10,600, 99.97 రకం ముంద్రా, ముంబై డెలివరి రూ. 12,800-12,850, 99.98 నాణ్యమైన సరుకు రూ. 12,900-12,950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్‌లో గత వారం 20 వేల బస్తాల యాసంగి సరుకు రాబడిపై తెల్లనువ్వులు హళ్లింగ్ సరుకు రూ. 8800-9100, 98.2 శాతం సరుకు రూ. 9100-9400, 99.1 శాతం సరుకు రూ. 9500-9800 మరియు 10 వేల బస్తాల నల్లనువ్వులు ప్రీమియం సరుకు రూ. 19,625-20,000, జడ్ బ్లాక్ రూ. 18,250-19,375, సాధారణ రకం రూ. 15,000-18,000, మిల్లురకం నువ్వులు రూ. 6500-8500 మరియు తమిళనాడులో గత వారం 300 బస్తాల రాబడిపై నల్లనువ్వులు రూ. 12,700-15,600, ఎర్రనువ్వులు రూ. 9500-13,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: August 18, 2025, 6:19 am