పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: February 17, 2025, 7:00 am