ముంబై ః వచ్చే వారం నుండి కందుల రాబడులు పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్పుర్గి, బీదర్, బాల్కీ, రాయిచూర్, సేడెం, చితాపూర్, కుస్తగి ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 80-85 వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కల్బుర్గిలో 5000-5500 బస్తాలు, బాల్కీలో 2000-2500 బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా స్థానిక మార్కెట్లలో రూ. 6300-7100, నాణ్యమైన సరుకు రూ. 8400-8750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ సరుకు దేశంలోని పప్పు మిల్లులకు సరఫరా అవుతున్నది. మహారాష్ట్రలోని లాతూర్, ఔరద్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 8300, అహ్మద్నగర్లో గ్రేడెడ్ సరుకు రూ. 8400, మీడియం రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. సంక్రాంతి తర్వాత రాబడులు పోటెత్తనున్నాయి. మహారాష్ట్ర ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతి రోజు 50-60 వేల బస్తాలు రాబడి అవుతుండగా ఇందులో సోలాపూర్లో 75-80 వాహనాలు, లాతూర్, అకోలాలో 14-15 వేల బస్తాల చొప్పున సరుకు రాబడిపై తెల్లకందులు రూ. 7700, మారుతి కందులు రూ. 7800, గులాబీ కందులు రూ. 7900-8000, సాధారణ రకం రూ. 7600-7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చెనె్నైలో లెమన్ కందులు రూ. 6800-6850, ముంబైలో రూ. 6900, మెుజాంబిక్ గజరి కందులు రూ. 6300, తెల్ల కందులు రూ. 6500-6550, వుట్వారా కందులు రూ. 6250-6300, కెన్యా తెల్లకందులు రూ. 6400, అరుశ రూ. 6800-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక కొత్త కందులు కట్ని డెలివరి రూ. 8300-8400, పప్పు మేలిమి రకం రూ. 12,800-13,000, కర్ణాటక కందులు ఇండోర్ డెలివరి రూ. 8200, మహారాష్ట్ర సరుకు రూ. 7900, నాగ్పూర్లో పప్పు మేలిమి రకం రూ. 13,700-13,800, సవానంబర్ రూ. 12,800-12,900, లాతూర్లో మేలిమి రకం రూ. 13,400-13,600, సవానంబర్ రూ. 11,400-11,600, అకోలాలో మేలిమి రకం రూ. 12,600-13,800, సవానంబర్ రూ. 11,000-11,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పెరగనున్న వాము రాబడులు హైదరాబాద్ ః దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణలో వాము రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. మరో వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఇప్పటికే కోతల ప్రక్రియ ప్రారంభమైనందున కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరో రెండు మూడు వారాలలో అన్ని మార్కెట్లల4 కొత్త సరుకు రాబడులు పోటెత్తే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా ధరలు మందగమనంలో కొనసాగగలవు. వుధ్యప్రదేశ్లోని నీవుచ్లో గత వారం 400-500 బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం రూ. 11,500-12,500, మీడియం రూ. 13,500- 13,700. నాణ్యమైన సరుకు రూ. 14,500-15,000 మరియు 1800-2000 బస్తాల పాత సరుకు సాధారణ రకం రూ. 13,500-14,000, మీడియుం రూ. 13,500-14,000, మీడియం బెస్ట్ రూ. 14,500-15,500, పోహరిలో 300-350 బస్తాలు నిమ్ము సరుకు రూ. 8000-8500, మీడియం రూ. 11,500-12,000, మీడియం బెస్ట్ రూ. 12,200-12,600, ఎసి సరుకు రూ. 10,500-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్నగర్లో 4-5 వేల బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం రూ. 14,000-14,500, మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, ఆకుపచ్చ సరుకు మీడియం రూ. 20,000-24,000, ఆకుపచ్చ బోల్డు సరుకు రూ. 28,000-28,500 మరియు 400-500 బస్తాల పాతసరుకు రాబడిపై సాధారణ రకం రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైనసరుకు రూ. 17,500-18,000, మీడియం బెస్ట్ రూ. 16,500-17,000, మీడియం రూ. 15,500-15,500 మరియు తెలంగాణలోని వికారాబాద్లో 100 బస్తాల కొత్త వాము రూ. 10,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరిపల్లి, పరిగి,
Updated On: January 12, 2025, 1:22 pmఊంఝా ః గుజరాత్లో జనవరి 6 నాటికి జీలకక్ర సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,60,841 హెక్టార్ల నుండి 87,226 హెక్టార్లు తగ్గి 4,73,615 హెక్టార్లకు పరిమితమైనప్పటికీ ప్రస్తుత సేద్యం 15 శాతం మాత్రమే తరుగు నమోదైందని రాష్ట్ర వ్యసాయ శాఖ పేర్కొన్నది. 2023 లో సేద్యం 2022 తో పోలిస్తే భారీగా విస్తరించిందని వ్యవసాయ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్తాన్లో ఉత్పాదకుల వద్ద సరుకు నిల్వలు ఇప్పటికీ అమ్మకం కాకుండా మూలుగుతున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడులు వృద్ధి చెందడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మార్చి, ఏప్రిల్లో ధరలు తగ్గినట్లయితే సరుకు నిల్వ చేయడం శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 24,500 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 625 పెరిగి రూ. 23,875, మార్చి వాయిదా రూ. 5 తగ్గి రూ. 23,370 వద్ద ముగిసింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 65-70 వేల బస్తాల రైతుల సరుకు రాబడి అవుతుండగా 75-80 శాతం సరుకు అమ్మకమవుతున్నందున ధరలు పురోగమించడంలేదు. గుజరాత్లోని గోండల్లో బుధవారం 15 వేల బస్తాల జీలకర్ర రాబడి అయింది. అయితి నిమ్ము మరియు నాసిరకం సరుకు వలన ప్రతి క్వింటాలు రూ. 9500 ధరతో ముహూర్త వ్యాపారమైంది. 4-5 వేల బస్తాల పాత సరుకు రాబడిపై మీడియం రూ. 21,000-21,500, మీడియం బెస్ట్ రూ. 22,500-23,000 మరియు ఊంఝా మార్కెట్లో గత వారం 30-32 వేల బస్తాలు సాధారణ రకం రూ. 20,000- 20,500, మీడియం రూ. 21,500-22,500, నాణ్యమైన సరుకు రూ. 23,000-23,500, క్లీన్ సరుకు రూ. 24,300, రాజ్కోట్లో 6-7 వేల బస్తాలు సాధారణ సరుకు రూ. 20,000-21,000, మీడియం రూ. 21,000-21,500, నాణ్యమైన సరుకు రూ. 21,500-22,000, యూరప్ రకం రూ. 22,000-22,250, కిరాణా రకం రూ. 22,300-22,500, హల్వాడ్ వురియుు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 20,500-21,000, మీడియుం బెస్ట్ రూ. 22,500- 22,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 12, 2025, 1:21 pmజావ్రా ః మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్లో ఇప్పటి వరకు మెంతుల పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. సానుకూల పవనాలు వీస్తున్నందున సరుకు నాణ్యత కూడా ఇనుమడించగలదని ఉత్పాదకులు భావిస్తున్నారు. మరో నెల రోజులలో కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది. కిరాణా వ్యాపారులు తమ అమ్మకాలకు అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకం కావడంలేదు. తద్వార ధర ప్రతి క్వింటాలుకు రూ. 300-400 పతనమైంది. మధ్యప్రదేశ్లోని జావ్రా మార్కెట్లో ప్రతి రోజు 1500 బస్తాల మెంతులు రాబడిపై సాధారణ రకం రూ. 5200-5400, మీడియం రూ. 5500-5600, నాణ్యమైన సరుకు రూ. 6100-6500, బోల్టు సరుకు రూ. 6800-7000, పాప్డా రూ. 7500-8000, నీమచ్ మార్కెట్లో 1600-1800 బస్తాలు సాధారణ రకం రూ. 5100-5200, మీడియం రూ. 5400-5500, నాణ్యమైన సరుకు రూ. 5800-6000, బోల్డు సరుకు రూ. 6800, మందసోర్లో 300-400 బస్తాలు సాధారణ రకం రూ. 5000-5200, మీడియం రూ. 5400-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 600 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 4500-5150, మీడియుం రూ. 5200-5600, నాణ్యమైన సరుకు రూ. 5650-5900, కిరాణా రకం రూ. 6000-6250 వురియుు రాజస్తాన్లోని కోటా, రామ్గంజ్మండి, నోఖా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 800-1000 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 4500-4600, మీడియం బెస్ట్ రూ. 5000-5200, నాణ్యమైన సరుకు రూ. 5500-5700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 12, 2025, 1:18 pmహైదరాబాద్ ః కర్ణాటకలోని మైసూరులో చెట్ల నుండి చింతపండు రాల్చే ప్రక్రియ జోరందుకున్నది. గత వారం 50 బస్తాల కొత్త చింతపండు రాబడి కాగా ఫ్లవర్ రూ. 9000, గింజ సరుకు రూ. 1800-2000 మరియు కేరళలోని ఫాల్గాట్లో కూడా 80-90 బస్తాలు ఫ్లవర్ రూ. 9500-10,000, గింజ సరుకు రూ. 3000-5000, నలగ్గొట్టని చింతపండు రూ. 2000-3500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మరో వారం రోజుల తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు, ధర్మపురి, థేని, క్రిష్ణగిరి, కర్ణాటకలోని తుమకూరు, బెల్గాంవ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు సానుకూల వాతావరణం నెలకొన్నందున రంగు, రుచి సంతృప్తికరంగా ఉండగలదని తెలుసోంది. వినియోగం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 10-15, పుంగనూరులో 20-25, సాలూరులో 10-15 వాహనాలు కలిసి మొత్తం 65 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమి ఫ్లవర్ రూ. 10,000, మీడియుం రూ. 8000, సాధారణ రకం రూ. 7000, గింజ సరుకు రూ. 3800-4000, రంగు వెలిసిన సరుకు రూ. 3600-3800, సిల్వర్ మేలిమి రకం రూ. 20,000-27,000, మేలిమి రకం రూ. 16,000-20,000, మీడియం బెస్ట్ రూ. 13,000-15,500, సాధారణ రకం రూ. 11,000-13,000, హిందూపూర్ స్థానిక మార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్డ్ రూ. 9000-11,000, మీడియం రూ. 7500-11,000, సాధారణ రకం రూ. 7500-8500 మరియు రూ. 6000-7000, పుంగనూరులో మేలిమి రకం రూ. 12,000-16,000, చపాతీ రూ. 11,000-12,000, మహారాష్ట్ర సరుకు రూ. 12,500, ఫ్లవర్ రూ. 8500-9500, గింజ సరుకు రూ. 4000-4500, మహారాష్ట్ర సరుకు రూ. 4800-5000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో 8-10 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై తెలంగాణ ఫ్లవర్ రూ. 7000-10,000, కర్ణాటక సరుకు రూ. 6500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 9000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంవ్లో స్వల్పంగా కొత్త సరుకు రాబడి కాగా ఫ్లవర్ రూ. 9000-10,000 మరియు 1-2 వాహనాల పాత సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 8500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 11,000-12,000, తుమకూరులో మేలిమి రకం ఎసి సరుకు రూ. 16,000-18,000, మీడియం రూ. 10,000, బార్షీలో మార్చి నెల సరుకు రూ. 10,500, ఏప్రిల్ రూ. 9000, మే రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10-12 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు రూ. 4100-4200, మీడియం రూ. 3200-3500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7000-8500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ రూ. 11,000, మీడియం సరుకు రూ. 8000-8500, గింజ సరుకు రూ. 3800-3900, తరానాలో 2-3 వాహనాల గింజ సరుకు అమ్మకంపై రూ. 3900-4100, మీడియం రూ. 3800-3900 బిల్టికట్ ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 20-25 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 8500-9000, మహారాష్ట్ర సరుకు రూ. 9500-9600, గింజ సరుకు స్థానికంగా రూ. 3500-4000, మహారాష్ట్ర సరుకు రూ. 4000-4500, నలగ్గొట్టని చింతపండు స్థానికంగా రూ. 2000-2400, మహారాష్ట్ర సరుకు రూ. 3100-3400, క్రిష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు రూ. 5600-6000, చపాతీ రూ. 4500-4700, మీడియం రూ. 3800-4000, ధర్మపురిలో చపాతీ మీడియం రూ. 7500-8000, గింజ సరుకు రూ. 3800-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు ః కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కొత్త చింతపండు సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది. సరుకు నుండి గింజలు వేరుచేసే మరో రెండు వారాలలో ప్రారంభం కానున్నది. ఇదే విధంగా కర్ణాటకలోని దావణగెరె, చెల్లకేరి, బెల్గాంవ్, తుమకూరు తదితర ప్రాంతాలలో ఫిబ్రవరి మొదటి వారం వరకు చింతగింజల రాబడలు కాగలవని తెలుస్తోంది. సీజన్ ప్రారంభంలో చౌక ధరతో కొనుగోలుచేసి నిల్వ శ్రేయస్కరం. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు రూ. 2900-3000, పప్పు సూరత్ డెలివరి రూ. 5300, పొడి రూ. 7400-7500, సాలూరులో చింతగింజలు రూ. 2900-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బార్షీ డెలివరి రూ. 3400, బార్షీలో పప్పు రూ. 5300-5550, పొడి రూ. 5800-6000, తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు రూ. 2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 12, 2025, 1:16 pmముంబై ః దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో పెసల ఉత్పత్తి పెరగడంతో పాటు రాబడులు జోరందుకున్నందున దిగజారుతున్న కందిపప్పు ధరల వలన పెసరపప్పు వినియోగం కుంటుపడుతోంది. తద్వారా అన్ని ఉత్పాదక ప్రాంతాలలో ధరలకు స్థిరత్వం చేకూరింది. పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేయడం మరో కారణమని చెప్పవచ్చు. రాజస్తాన్లోని నాగోర్, మెడతాలో పెసలు పాలిష్ చెన్నై డెలివరి రూ. 9400, నాగోర్లో 10 వేల బస్తాల కొత్త పెసల రాబడిపై రూ. 7200-8000, కిషన్గఢ్, మెడతా, సుమేర్పూర్, కేక్డి, పాలి ప్రాంతాలలో 10-12 వేల బస్తాలు స్థానిక మార్కెట్లలో రూ. 6000-7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం ఈ సరుకు ఉత్తరప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు పప్పు మిల్లులకు రవాణా చేయబడుతున్నది. రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల మిటుకుల రాబడిపై స్థానిక మార్కెట్లలో రూ. 4300-4800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని గదగ్లో రూ. 7000-8011, బీదర్లో 6050-8300 మరియు వుహారాష్ట్రలోని లాతూర్, ఉద్గిర్లో రూ. 6000- 8800, గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్లో రూ. 6000-9000, మధ్యప్రదేశ్లోని పిపరియా, హర్దాలో రూ. 6000-8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 12, 2025, 1:14 pmహైదరాబాద్ : దేశంలోని పసుపు ఉత్పాదక కేంద్రాల వద్ద నెలకొన్న మసాలా గ్రైండింగ్ యూనిట్ల డిమాండ్ మరియు అడుగంటిన వలన మిగులు నిల్వల వలన ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-250 వృద్ధి చెందింది. తెలంగాణలో పసుపు తవ్వకాల ప్రక్రియ మరో రెండు వారాలలో ప్రారంభం కానున్నది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 14,038 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 106 నృద్ధి చెంది రూ. 14,144, మే వాయిదా రూ. 372 లాభంతో రూ. 14,272 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో సోమ, మంగళవారాలలో కలిసి 1800-2000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 13,000-13,800, దుంపలు రూ. 12,000-12,400 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి పాలిష్ సరుకు కొమ్ములు రూ. 14,500-14,600, దుంపలు రూ. 13,700-13,800, వరంగల్లో 150-200 బస్తాలు కొమ్ములు రూ. 11,500- 12,000, దుంపలు రూ. 10,500-11,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 400-500 బస్తాలు కొమ్ములు దుంపలు రూ. 10,800-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 12,000-13,500, నాణ్యమైన సరుకు రూ. 11,200-12,500, మీడియం రూ. 13,000-13,500, దుంపలు రూ. 13,000-13,200, మీడియం రూ. 12,500-12,800, నాందేడ్లో 3 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 12,000-14,000, దుంపలు రూ. 10,500-13,300, సాంగ్లీలో 6-7 నేల బస్తాలు రాజాపురి పసుపు రూ. 14,500-15,500, దుంపలు రూ. 13,800-14,000, కొమ్ము, దుంపలు మీడియుం రూ. 12,500-13,200 మరియు ఒడిశ్శాలోని బరంపురంలో 500-600 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 12,000, పాలిష్ సరుకు రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 16-17 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 6888-14,215, దుంపలు రూ. 6355-13,380, పెరుందురైలో 1000-1200 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 10,869-14,510, దుంపలు రూ. 9665-13,358, గోబిచెట్టిపాలయంలో కొమ్ములు రూ. 10,022-14,499, దుంపలు రూ. 11,122-13,299 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 8, 2025, 7:49 amहैदराबाद : व्यापारिक सूत्रों के अनुसार गुजरात में बुवाई पिछले वर्ष के मुकाबले कम होने से कुछ स्टाकिस्ट सक्रिय हो गये, लेकिन मध्यप्रदेश, राजस्थान में बुवाई की स्थिति सामने नहीं आ रही है, लेकिन अनुमान है कि दोनों की कुल बुवाई में अधिक कमी नहीं आयेगी और पुराना माल अभी तक बकाया स्टॉक रहने से नया सीजन आने तक अधिक तेजी की संभावना नहीं रहेगी। पिछले सप्ताह एनसीडीईएक्स पर धनिया का जनवरी वायदा 7884 रुपये खुलने के बाद शुक्रवार तक 196 बढकर 8080 रुपये अप्रैल वायदा 62 बढकर 8600 रुपये पर बंद हुआ। राजस्थान के रामगंजमंडी में पिछले एक सप्ताह में 15 से 16 हजार बोरी की आवक पर बादामी 6900-7100, ईगल 7300-7400, स्कूटर 7800-8000 रुपये, कोटा में 3 से 4 हजार बोरी, बारन में 4 से 5 हजार बोरी की आवक पर बादामी 6600-7000, ईगल 7200-7500 रुपये एवं मोटर बिल्टी प्रति 40 किलो बादामी 3450, ईगल 3650, स्कूटर 3800 रुपये तथा धनिया दाल बादामी 7600, ईगल 7800, स्कूटर किस्म 8100 रुपये प्रति क्विंटल क्वालिटी के अनुसार व्यापार हुआ। मध्य प्रदेश के गुना में एक सप्ताह में 8 से 98 हजार बोरी, कुम्भराज में 7 से 8 हजार, नीमच में 4 से 5 हजार और बीनागंज में 500 से 600 बोरी, मंदसोर में 4 से 5 हजार बोरी की आवक पर बादामी 6800-7200, ईगल 7300-7600, स्कूटर 7700-8100, कलर वाला 8600-9500 रुपये के मूल्य पर व्यापार हुआ। गुजरात के गोंडल में एक सप्ताह में 17 से 18 हजार बोरी की आवक पर ईगल 7000-7300 रुपये, ईगल प्लस 7400-7500, स्कूटर 7800-8000, कलर वाला माल 8500-9500 रुपये एवम् राजकोट में 5 से 6 हजार बोरी, जुनागढ में 3 से 4 हजार बोरी और अन्य मंडियो में 8 से 10 हजार बोरी की आवक पर बादामी 6600-6800, ईगल 7000-7250, ईगल प्लस 7500-7700, स्कूटर 7800-7875 रुपये, कलर वाला 8300-9250 रुपये के मूल्य पर व्यापार हुआ। आंध्र में बादामी 3625, ईगल 3700, स्कूटर 3780 रुपये, एसी का माल 3650 रुपये प्रति 40 किलो के मूल्य पर व्यापार हुआ।
Updated On: January 8, 2025, 7:47 amముంబై : రష్యా, ఉక్రెయిన్లో సన్ఫ్లవర్ ఉత్పత్తి కుంటుపడినందున 2024-25 సీజన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సన్ఫ్లవర్ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే 10 శాతం తగ్గి 5.05 కోట్ల టన్నులకు పరిమితం కాగలదని అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్డిఎ) పేర్కొన్నది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్, రష్యా ఉత్పత్తిపై తుది నిర్ణయం తొందరపాటు చర్య అవుతుందని యుఎస్డిఎ తెలిపింది. అయితే, 2023 తో పోలిస్తే 11 శాతం తగ్గగలదని స్పష్టమవుతున్నదని ప్రకటించింది. ఐరోపా సమాఖ్య, టర్కీ, అమెరికాలో కూడా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఐరోపా సమాఖ్య, ఉక్రెయిన్, రష్యా, అమెరికాలో క్రషింగ్తో పాటు 2024-25 సీజన్లో సన్ఫ్లవర్ క్రషింగ్ గత మార్కెటింగ్ సంవత్సరంతో పోలిస్తే 10 శాతం తగ్గి 4.73 కోట్ల టన్నులకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తద్వారా 2024-25 సీజన్లో ప్రపంచ సరఫరా 14 శాతం కొరవడగలదని స్పష్టమవుతున్నది. అమెరికా సన్ఫ్లవర్ ఎగుమతులు కూడా ఇందుకు భిన్నంగా లేదు. 2025 సెప్టెంబర్ 30 తో ముగియనున్న సీజన్ చివరి నాటికి ప్రపంచ సన్ఫ్లవర్నూనె నిల్వలు 25 శాతం తగ్గి 22.30 ల.ట.కు పరిమితం కానున్నది. గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే కనిష్ఠ స్థాయికి చేరగలదు. సరఫరా తగ్గే అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లో సన్ఫ్లవర్ నూనె ధర క్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి నమోదైంది. 2025 లో సన్ఫ్లవర్నూనె పరిశ్రమ కోసం పలు సవాళ్లతో కూడుకొని ఉండగలదు. ఎందుకనగా సన్ఫ్లవర్ విత్తుల పెట్టుబడి వ్యయం పెరగడం వలన నూనె మిల్లులకు క్రషింగ్పై లాభాలు తరిగిపోగలవు. అయినప్పటికీ వచ్చే నెలలో ధర దక్షిణ అమెరికాలోని నూనెగింజలు ప్రధానంగా సోయాచిక్కుడు పంటపై ఆధారపడి ఉండగలదు. అంతేకాకుండా అమెరికా డాలర్తో పోలిస్తే బలోపేతం చెందే అవకాశం ఉంది. తద్వారా దిగుమతి దేశాలకు దిగుమతి వ్యయం భారీగా పెరగడం వలన ఎగుమతులు కుంటుపడే అవకాశం ఉంది.
Updated On: January 8, 2025, 7:47 amముంబై : దేశంలో కంది సేద్యం భారీగా విస్తరించడంతో పాటు గణనీయమైన ఉత్పత్తి సాధించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కందుల ధర రూ. 12,000 నుండి దిగివచ్చి రూ. 7800-8200 వద్ద కదలాడుతున్నది. మరో వారం రోజులలో ఉత్తర కర్ణాటకలో పంట కోతల ప్రక్రియ ప్రారంభం కానున్నది. తద్వారా అన్ని మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. మహారాష్ట్రలోని అహ్మద్గనర్, జామ్ఖేడ్ ప్రాంతాలలో కొత్త కందులు చెన్నై డెలివరి రూ. 8400-8500, ఔరంగాబాద్ నాణ్యమైన సరుకు రూ. 8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైన తర్వాత మందగమనం కొనసాగుతున్నది. చెనె్నైలో లెమన్ కందులు రూ. 7700, ముంబైలో రూ. 7500, మెుజాంబిక్ గజరి కందులు రూ. 6350, తెల్ల కందులు రూ. 6500, వుట్వారా కందులు రూ. 6350,, కెన్యా తెల్లకందులు రూ. 6400, అరుశ రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక కొత్త కందులు కట్ని డెలివరి రూ. 8800-8900, పప్పు మేలిమి రకం రూ. 13,000-13,200, కర్ణాటక కందులు ఇండోర్ డెలివరి రూ. 8000-8100, దిల్లీలో కర్ణాటక కందులు రూ. 8400-8500, రాయిపూర్లో రూ. 8500-8750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2024 ఖరీఫ్ సీజన్ కోసం కందుల మద్దతు ధర రూ. 7550 తో 9,66,575 టన్నుల సరుకు కొనుగోలు చేయాలని నాఫెడ్ను ఆదేశించింది. ఇందులో ఉత్తరప్రదేశ్ నుండి 3,95,170, కర్ణాటక 3,06,150, ఆంధ్రప్రదేశ్ 95,620, తెలంగాణ 1,65,140 మరియు హరియాణా నుండి 495 టన్నుల కందులు కొనుగోలు చేయనున్నది. హరియాణాలో 2024 డిసెంబర్ 1-31 కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుండగా మిగిలిన రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో చేపట్టబడుతుందని నాఫెడ్ తెలిపింది. మహారాష్ట్రలోని లాతూర్లో ప్రతి రోజు 4-5 వేల బస్తాలు, సోలాపూర్లో 90-100 వాహనాలు, అకోలాలో 10-12 వేల బస్తాలు, జాల్నాలో 4000-4500 బస్తాలు, దూధిని, అహ్మద్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 15-20 వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా సోలాపూర్లో మారుతి కందులు రూ. 7000-7650, గులాబీ కందులు రూ. 7500-8450, సాధారణ రకం రూ. 7700-7900, లాతూర్లో 63-నంబర్, మారుతి, తెలుపు మరియు గులాబీ కందులు రూ. 7500-8200, అహ్మద్నగర్లో నల్లకందులు రూ. 7600, తెల్లకందులు రూ. 7800, ఎర్ర కందులు రూ. 7700, అకోలాలో మారుతి కందులు రూ. 8200, కర్ణాటక గులాబీ కందులు రూ. 8550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గి, యాద్గిర్, బీదర్, బాల్కీ, రాయిచూర్ ప్రాంతాలలో 8-10 వేల బస్తాల కొత్త కందులు రూ. 7000-8150, తెలంగాణలోని తాండూరులో 4-5 వేల బస్తాలు రూ. 7800-8800, లాతూర్లో పప్పు మేలిమి రకం రూ. 14,000, సవానంబర్ రూ. 12,800, అకోలాలో మేలిమి రకం సార్టెక్స్ రూ. 14,500, నాన్-సార్టెక్స్ రూ. 14,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ ప్రాంతం కందులు రూ. 7700, పప్పు సార్టెక్స్ రూ. 12,900, మాచర్లలో పాలిష్ పప్పు సార్టెక్స్ రూ. 12,500 మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్, దమోహ్, కరేలి ప్రాంతాలలో కందులు మీడియం సరుకు రూ. 6500-8000, గుజరాత్లోని దాహోద్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో మీడియం కందులు రూ. 7000-8000, నాణ్యమైన సరుకు రూ. 8500-8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 8, 2025, 7:46 amహైదరాబాద్ : గత వారం బలహీనపడిన నూనె మిల్లర్ల కొనుగోళ్లు, అవసరానికి అనుగుణంగా వ్యాపారులు సరుకు కొనుగోలు చేస్తున్నందున నువ్వుల ధరలకు స్థిరత్వం చేకూరింది. పశ్చిమ బెంగాల్లో గత వారం 4-5 వాహనాల యాసంగి నువ్వుల అమ్మంకపై 3 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు స్థానికంగా రూ. 9100-9200, 2 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 10,000-10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద హళ్లింగ్ సరుకు రూ. 12,000, 99.98 మరియు 99.97 శాతం సరుకు ముంబై, ముంద్రా డెలివరి హళ్లింగ్ నువ్వులు రూ. 15,750-15,800, గుజరాత్ సరుకు 99.1 శాతం యాసంగి క్లీన్ సరుకు రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు రూ. 10,000-11,000, కడప, బద్వేలు ప్రాంతాలలో నువ్వులు స్థానికంగా రూ. 11,000, విరుధ్నగర్ డెలివరి (75 కిలోల బస్తా) రూ. 8500, విజయనగరంలో తెల్లనువ్వులు రూ. 10,500-11,000 వురియుు తమిళనాడులోని శివగిరి, ముత్తూరు ప్రాంతాలలో నల్లనువ్వులు స్థానికంగా రూ. 16,300-17,000, ఎర్రనువ్వులు రూ. 13,600-15,125 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద 10-12 వేల బస్తాల నువ్వుల రాబడిపై 95.5 శాతం సరుకు రూ. 8500-9750, హళ్లింగ్ సరుకు మీడియం రూ. 10,000-10,150, నాణ్యమైన సరుకు రూ. 10,875-11,500, 98.2 శాతం సరుకు రూ. 11,300-11,650, 99.1 శాతం రూ. 12,000-12,500, తెల్లనువ్వులు కిరాణా రకం రూ. 13,500-14,000, జడ్-బ్లాక్ ప్రీమియం సరుకు రూ. 24,500-25,000, నల్లనువ్వులు రూ. 23,250-24,500, సాధారణ రకం రూ. 17,500-22,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: January 8, 2025, 7:46 am