హైదరాబాద్ : ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో సెప్టెంబర్ 7 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2 లక్షల 37 వేల 126 బస్తాల నుండి తగ్గి 1 లక్ష 84 వేల 689 బస్తాల పరిమితం కాగా మరో వారం రోజులలో మొత్తం సరుకు నిల్వలు అడుగంటనున్నాయి. లాభసాటి ధరలు లభిస్తున్నందున బెల్లం తయారీ ప్రక్రియ రాకెట్ వేగంతో చేపడు తున్నారు. ముందస్తుగా చేపట్టిన చెరకు పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు వారాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొత్తం సరుకు వినియోగించబడింది. (మిగతా 2వ పేజీలో)
Updated On: September 15, 2026, 1:54 pmగుంటూరు : ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, గుంటూరు, పల్నాడు, మచిలీపట్నం లగాయతు పరిసర ప్రాంతాలలో శనివారం సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున రైతులు ఆనందోత్సాహాలతో మిర్చినాట్లు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే, ఉత్పత్తి భవిష్యత్ వాతావరణంపై ఆధారపడి ఉండగలదు. ప్రస్తుతం మేలిమి రకాల సరుకు నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో వర్షాలు ముఖం చాటేసినందున ఇంతకు ముందు విత్తన పంటకు తెగులు సోకుతున్నది. ప్రస్తుతం లాభాల కోసం నాసిరకం సరుకు విక్రయిస్తున్నందున ధరలు పురోగమించడంలేదు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాల కొత్త సరుకు కోసం వ్యాపారులు దృష్టి సారిస్తున్నారు. కావున ఈ రాష్ట్రాలలో ఈసారి సీజన్ ముందస్తుగా ముగియనున్నట్లు స్పష్టమవుతున్నది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో పంట
Updated On: September 15, 2026, 1:52 pmఈరోడ్ : పసుపు ఉత్పత్తికి ప్రముఖ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో నైరుతి రుతుపవనాల వర్షాలు ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో స్టాకిస్టులు తమ సరుకు అమ్మకాలు కుదించారు. మసాలా తయారీదారుల డిమాండ్ నెలకొన్నందున నగదు మార్కెట్ సహ వాయిదా మార్కెట్లో ధరలు ఎగిసిపడుతున్నాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ముందస్తు వాయిదా విక్రేతల కొనుగోళ్ల వలన అక్టోబర్ వాయిదా రూ. 20,450 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 760 వృద్ధి చెంది రూ. 21,210, డిసెంబర్ రూ. 156 ఇనుమడించి రూ. 21,158 వద్ద ముగిసింది. అక్టోబర్ వాయిదా ముగిసేనాటికి లేదా తర్వాత డిసెంబర్ వాయిదా జోరందుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని బస్మత్నగర్లో గత వారం 18 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 16,000-17,000, దుంపలు రూ. 15,500–16,000, నాందేడ్లో నాందేడ్ 3 వేల బస్తాలు, హింగోళి 22 వేల బస్తాల సరుకు రాబడి పై కొమ్ములు రూ. 16,000-17,000, దుంపలు రూ. 16,000–16,200, సాంగ్లీ మార్కెట్లో 12 వేల బస్తాలు రాజాపురి మేలిమి రకం రూ. 19, 000-20,000, దుంపలు రూ. 17,000-18,500 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని నిజామాబాద్లో మార్కెట్లో 3 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 15,000–15,500, దుంపలు రూ. 14,000–18,000, వికారాబాద్లో కొమ్ములు, దుంపలు రూ. 8521-12,255, పరంగల్లో § 5. 14,129-14,885, ລ້ລ້ . 14,885-15,278, కేసముద్రం మార్కెట్లో కొమ్ములు రూ. 9119-12,221, దుంపలు రూ. 11,001-11,011 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో కొమ్ములు, దుంపలు రూ. 14,460-15,000 మరియు ఒడిశ్శాలోని బరంపురంలో అన్-పాలిష్ సరుకు రూ.13,500, పాలిష్ సరుకు రూ. 14,300, నిజామాబాద్ సరుకు కొమ్ములు లారీ బల్టి రూ. 18,300-18,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో 8 వేల బస్తాల సరుకు § 11,289–17,696, ລ້ລ້ . 10,399–16,311, పెరుందురై 1000 బస్తాలు కొమ్ములు రూ. 11,569– 17,849, దుంపలు రూ. 11,199–16,455, సేలంలో 2 వేల బస్తాలు కొమ్ములు రూ. 16,500 –17,199, దుంపలు రూ. 15,688-19,239 ధరతో వ్యాపారమైంది.
Updated On: September 15, 2026, 1:50 pmహైదరాబాద్ : గడిచిన రెండు-మూడేళ్లుగా పాత సరుకు అమ్మకాలతో పాటు దిగుమతి సరుకు నాణ్యత కోల్పోయినందున చిన్నతరహా మసాలా తయారీదారులు మాత్రమే సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వాయిదా ధరలతో పాటు నగదు మార్కెట్లో ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి. అయితే రాజస్తాన్, గుజరాత్ వ్యాపారులు తమ నాణ్యమైన సరుకు అమ్మకాలు నిలిపివేసినందున దీపావళి వరకు ఇదే ఒరవడి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా సరుకు నిల్వలు అడుగంటాయి. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో నాలుగు నెలలు సమయం ఉంది. వాతావరణం ఆధారంగా సేద్యం విస్తరించే అవకాశం ఉంది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 15,602 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 640 కోసుకుపోయి రూ. 14,962, డిసెంబర్ రూ. 15,990 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 570 నష్టంతో రూ. 15,420 వద్ద స్థిరపడింది. రాజస్తాన్లోని రామంజ్మండి, కోటా, బారన్ ప్రాంతాలలో 18 వేల బస్తాల సరుకు రాబడిపై బారన్లో బాదామీ ధనియాలు రూ. 13,400–13,900, ఈగల్ రూ. 14,000–14,400, స్కూటర్ రకం రూ. 14,500–14,900, రంగు సరుకు రూ. 15,200-16,700 మరియు మధ్య ప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో 5 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 14,400–14,600, ఈగల్ రూ. 14,800-15,000, స్కూటర్ రకం రూ. 15,500-16,000, రంగు సరుకు రూ. 16,500-17,000, కుంభరాజ్ 2500 బస్తాలు, గునా మార్కెట్లో 14 వేల బస్తాలు బాదామీ ధనియాలు రూ. 13,600–14,000, ఈగల్ రూ. 14,100-14,600, స్కూటర్ రకం రూ. 14,800-15,200, రంగు సరుకు రూ. 15,300-16,800 మరియు గుజరాత్లోని గోండల్ 4 వేల బస్తాలు, జునాగఢ్, జామ్నగర్లో 2 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు రూ. 14,600-14,800, ఈగల్ రూ. 14,900-15,100, +. 15,100-15,300, . 15,500-15,800, రంగు సరుకు రూ. 16,000-17,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: September 15, 2026, 1:48 pmకొచ్చి : దేశవ్యాప్తంగా ఎల్నినొ ప్రభావంతో కొరవడిన వర్షాలు, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణతాపం శీతాకాలంలో కూడా ఇదే ఒరవడి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మిరియాలు, లవంగాలు, జాపత్రి తదితర సరుకుల దేశీయ వినియోగం తగ్గగలదనే అంచనా వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఉత్పాదకుల వద్ద మిరియాల నిల్వలు పేరుకుపోతున్నాయి. కొత్త సరుకు రాబడులు సమీపిస్తున్నాయి. గ్వాటేమాలాలో యాలకుల పంట ఆశాజనకంగా లేనందున పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రైతులు మిరియాలకు బదులు యాలకుల అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు. ఒడిదొడుకులకు లోనవుతున్న శ్రీలంక కరెన్సీ పెరుగుతున్న కొనుగోళ్లతో ధరల పెరుగుదలకు మద్దతు లభిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో శ్రీలంక నుండి దిగుమతులు పోటెత్తగలవని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో సెప్టెంబర్-డిసెంబర్ మధ్య కాలంలో వినియోగ రాష్ట్రాలలో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఇప్పటికే సరుకు కొనుగోలుచేసి నిల్వ చేసుకున్నారు. ఇటీవల 50 టన్నుల సరుకు దిగుమతి కాగా ఇందులో శ్రీలంక సరుకే అత్యధికంగా ఉంది. భారత మార్కెట్లో శ్రీలంక మిరియాలు ప్రతి కిలో అన్-గార్బుల్డ్ రూ. 704, గార్బుల్డ్ రూ. 724 ధరతో వ్యాపారమైంది. తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలోని ఇదుక్కితో పాటు ప్రముఖ ఉత్పాదక ప్రాంతాలలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు మరియు ప్రతికూల వాతావరణం వలన 2026 కోతల సీజన్లో మిరియాల ఉత్పత్తి దాదాపు 75 వేల టన్నులు ఉండగలదని భారత మిరియాలు మరియు మసాలా వాణిజ్య సమాఖ్య (ఐపిఎస్టిఎ) అంచనా. అయితే వాస్తవంగా ఎల్నినొ ప్రభావం వలన కుంటుపడగలదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, శ్రీలంకలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి మరియు భారత-శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన శూన్య శాతం సుంకంతో భారత వ్యాపారులు ప్రతియేటా సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వియత్నాం మిరియాలు ప్రతి టన్ను 6000 డాలర్, బ్రెజిల్ సరుకు 5800 డాలర్ ప్రతిపాదించబడుతున్నది.
Updated On: September 15, 2026, 1:46 pmపెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: February 17, 2025, 7:00 am